
యాచారం, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల వినోద్‌కుమార్(27) మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల హాస్పిటల్లో ట్రీట్మెంట్తీసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున వినోద్‌కుమార్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న యాచారం పోలీసులు డెడ్‌బాడీని హాస్పిటల్‌కు తరలించారు.
పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనారోగ్యం కారణంగానే వినోద్‌కుమార్ సూసైడ్ చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.