- మధ్యాహ్న భోజనం వికటించినట్లుగా అనుమానం
- వాంతులు, తీవ్రమైన దగ్గుతో ఇబ్బందులు
- పెద్దపల్లి ప్రధాన ఆస్పత్రిలో ట్రీట్మెంటు
పెద్దపల్లి, ముత్తారం, వెలుగు: కస్తూర్బా గాంధీ స్కూల్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మెనూ లో భాగంగా విద్యార్థినులకు చికెన్ పెట్టారు. తిన్న తర్వాత 35 మంది స్టూడెంట్లు వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో ముత్తారం ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించారు.
అయినా వాంతులు తగ్గకపోవడంతో పాటు దగ్గు తీవ్రమడంతో సాయంత్రం 8 గంటలకు ప్రయివేట్ వాహనాల్లో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్శ్రీధర్, చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ఫిజీషియన్లు అస్వస్థతకు గురైన 35 మంది విద్యార్థినులకు ట్రీట్మెంటు అందించారు.
విద్యార్థినులు అస్వస్థతకు గురవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. కేజీబీవీలో 350 మంది ఉండగా, 35 మంది విద్యార్థులు అస్వస్థకు పాలవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో పేరెంట్స్‌తో పాటు స్కూల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.