- దంపతుల మధ్య గొడవ.. భర్త మృతి
- భార్య పరిస్థితి విషమం
- రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో ఘటన
వేములవాడ, వెలుగు:దంపతుల మధ్య జరిగిన గొడవలో భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచకు చెందిన రౌతు మహిపాల్(47), సుజాత దంపతుల మధ్య వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఇద్దరూ కర్రలతో కొట్టుకొని పడిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు రక్తం మడుగులో పడి ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అం దించారు.
అప్పటికే మహిపాల్ మృతిచెందగా, సుజాతను హాస్పిటల్‌కు తరలించినట్టు సీఐ వీరప్రసాద్ తెలిపారు.