- వాటర్ హీటర్ షాక్ కొట్టియువకుడి మృతి
మియాపూర్, వెలుగు: కరెంట్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన మియాపూర్ లిమిట్స్‌లో జరిగింది. మియాపూర్ మదీనగూడలోని కల్కి గార్డెన్స్‌లో నివాసం ఉంటున్న వెంకట లక్ష్మీకాంత్‌రెడ్డి(18) ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
సోమవారం ఉదయం అఫీస్‌కు వెళ్లేందుకు బాత్రూమ్లో బకెట్ నింపి వాటర్ హీటర్ పెట్టాడు. కొద్దిసేపటికి నీళ్లు వేడిగా అయ్యాయా అని చూసేందుకు హీటర్ ఆన్‌లో ఉండగానే నీటిలో చేతి పెట్టాడు. దీంతో కరెంట్ షాక్‌తగిలి లక్ష్మీకాంత్‌రెడ్డికి కింద పడిపోయాడు.
వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.