ఫొటోలను సోషల్​ మీడియాలో పెట్టారని బలవన్మరణం

  • తన ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్​ మీడియాలో పెట్టారని బలవన్మరణం
  • వరంగల్​ లో ఘటన

వరంగల్‍, వెలుగు: తన క్లాస్​మేట్​తో కలిసి ఉన్న ఫొటోలను తోటి స్టూడెంట్లు సోషల్‍ మీడియాలో పోస్ట్​ చేయడంతో కలత చెందిన ఓ ఇంజనీరింగ్‍ విద్యార్థిని సూసైడ్​ చేసుకుంది. ఆదివారం రాత్రి గ్రేటర్‍ వరంగల్​లో ఈ సంఘటన జరిగింది. జయశంకర్ భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతురు రక్షిత(21) వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేట్​ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ థర్డ్​ ఇయర్​ చదువుతున్నది.

ఇంజనీరింగ్​ విద్యార్థిని సూసైడ్

రక్షిత మరో స్టూడెంట్​తో కలిసి దిగిన ఫొటోలను కొందరు స్టూడెంట్లు సోషల్‍ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో వరంగల్ సిటీలోని తన బంధువుల ఇంటికొచ్చింది. ఆదివారం సాయంత్రం అక్కడే ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రక్షిత డెడ్​బాడీని పోస్ట్​మార్టం కోసం ఎంజీఎం మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.