కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోతిని రక్షించబోయి విద్యుత్ షాక్ తో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముకుంద సత్యం(56) ఆగస్టు 15 మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. కాగా ట్రాన్స్ ఫార్మర్ లో చిక్కుకున్న కోతిని చూశాడు.
ALSO READ :ఆయిల్ ట్యాంకర్లపై బాంబులు : ఉక్రెయిన్ దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత
అయితే ఆ కోతిని ఎలాగైనా తప్పించాలని.. దాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన రైతుకు కూడా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కోతి కూడా మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.