ఊయల తాడే.. ఉరితాడైంది!

ఊయల తాడే.. ఉరితాడైంది!
  • పిల్లలను ఆడించేందుకు చీరను కట్టగా.. 
  • మెడకు చుట్టుకుని మహిళ మృతి
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన

బెల్లంపల్లి, వెలుగు:  పిల్లలను ఆడించేందుకు కట్టిన ఊయల మెడకు చుట్టుకుని మహిళ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. పోలీసులు తెలిపిన ప్రకారం..  బెల్లంపల్లి టౌన్ లోని  బెల్లంపల్లి బస్తికీ చెందిన పోషంపల్లి నీరజ (42)కు ముగ్గురు పిల్లలు నవ్య, ధనుష్, సుచిత్ర ఉన్నారు.  

వీరిని ఆడించేందుకు ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం ముగ్గురు పిల్లలను ఆడించగా ప్రమాదవశాత్తూ ఉయ్యాల చీర ఆమె మెడకు చుట్టుకుంది. పిల్లలు ఏడ్వడంతో ఆమె అత్త వచ్చి చూసింది. అప్పటికే నీరజ ప్రాణం పోయింది. కళ్లెదుటే తల్లి మృతి చెందడంతో  పిల్లలు బోరున విలపించారు. బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసులు కేసు 
నమోదు చేశారు.