మేళ్లచెరువు, వెలుగు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి అప్పులపాలైన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..మేళ్లచెరువు సువర్ణ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒంటెద్దు అశోక్ రెడ్డి(33) జూనియర్ కెమిస్ట్. ఖాళీ సమయాల్లో ఆన్లైన్ గేమ్స్ఆడుతూ బానిసయ్యాడు. సొంత డబ్బులతో పాటు అప్పు తీసుకుని వాటినీ పోగొట్టాడు.
సుమారు రూ.30 లక్షల వరకు అప్పు కావడం, వాటిని తీర్చే దారి లేక కుంగిపోయాడు. శుక్రవారం నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలోని భార్య పుట్టింట్లో ఆమెను,పాపను వదిలిపెట్టి ఇంటికి వెళ్లాడు. రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ఆలస్యంగా గుర్తించిన తోటి ఉద్యోగులు భార్యకు సమాచారమిచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.