
జనగామ:అక్కతమ్ముళ్ల మధ్య అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తోబుట్టువుగా అక్క..తమ్మునిపై అమితమైన ప్రేమ కురిపిస్తుంది..తల్లి తర్వాత తల్లిలా సాకు తుంది..లాలిస్తుంది.ఆడిస్తుంది..పెరిగి పెద్దయ్యే వరకు తోడుంటుంది..కానీ జనగామ జిల్లాలో ఓ అక్క మరణంలో కూడా తమ్ముడికి తోడయ్యింది. తమ్ముడి మరణం తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలింది.
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది.తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి చెందిన ఘటన లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి గాడిపెల్లి శంకర్ (50) అనారోగ్యం తో మృతి చెందాడు. ఆదే గ్రామంలో నివాసం ఉం టున్న మృతుని అక్క కొలుపుల రుకుంబాయి (54) తమ్ముడిని మృతదేహం చూసి స్పృహ కోల్పోయింది. జనగామలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది..
శంకర్ దహనసంస్కారాలు నిన్న పూర్తి కాగా రుకుంబాయి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు బంధువులు.