- భార్యకు మెసేజ్ చేసి కానిస్టేబుల్ మిస్సింగ్
- ఆచూకీ కోసం వనపర్తి జిల్లా పోలీసుల గాలింపు
పానుగల్, వెలుగు: ఆర్థిక కష్టాలతో డ్యూటీ చేయలేకపోతున్నానని భార్యకు మెసేజ్ చేసి కానిస్టేబుల్ అదృశ్యమైన ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పానుగల్పీఎస్ కానిస్టేబుల్ రామకృష్ణ(పీసీ 2234) మంగళవారం రాత్రి తన భార్య ఫోన్ కు ఆర్థిక ఇబ్బందులతో డ్యూటీ చేయలేకపోతున్నానని మెసేజ్ చేశాడు.
పీఎస్ నుంచి ఎస్కార్ట్ పీసీగా లాస్ట్ డ్యూటీ చేశాడు. ఆ తర్వాత నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అతని భార్య మంజుల ఫిర్యాదుతో మిస్సింగ్ నమోదు చేసి 4 టీమ్ లతో గాలింపు చేపట్టినట్టు అడిషనల్ ఎస్పీ శ్రీరామదాసు తేజావత్ తెలిపారు.