మేడ్చల్, వెలుగు: రూ.100 కోసం ఒకరిని హత్య చేసిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. మేడ్చల్ లోని వెంకటరమణారెడ్డి కాలనీకి చెందిన పోచయ్య(45) కూలీ పనులు చేయిస్తుంటాడు. ఇతని దగ్గర పనిచేసే మధ్య ప్రదేశ్ కి చెందిన యువకుడు శనివారం రూ.100 కావాలని పోచయ్యను అడిగాడు. తన దగ్గర క్యాష్లేదని, రేపు ఇస్తానని పోచయ్య చెప్పగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆ యువకుడు బండరాయితో పోచయ్యపై దాడిచేశాడు. తీవ్ర గాయాలతో పోచయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు.