కూతుళ్లను కాపాడబోయి రైలు ఢీకొని.. ముగ్గురు స్పాట్ లోనే.. రైల్వే పోలీస్ క్లారిటీ

కూతుళ్లను కాపాడబోయి రైలు ఢీకొని.. ముగ్గురు స్పాట్ లోనే.. రైల్వే పోలీస్ క్లారిటీ

అతనో రైల్వే ఉద్యోగి.. డ్యూటీ లోనే ఉన్నాడు. ఇంతలో తండ్రిని కలిసేందుకు ఇద్దరు కూతుళ్లు,అతని భార్య వచ్చారు.సరదాగా రైల్వే ట్రాక్ సమీపంలో ఆడుతున్న ఆ చిన్నారులను అనుకోని సంఘటన బలితీసుకుంది.. దురుదృష్టం కొద్దీ ఆ చిన్నారులు అనుకోకుండా ట్రాక్ పైకి వచ్చారు.. అదే సమయంలో ట్రాక్ పై శరవేగంగా దూసుకొస్తున్న రైలు బిడ్డలను శరీరాలను క్షనాల్లో చిధ్రం చేసింది.

బిడ్డలను కాపాడుకునేందుకు ప్రయత్నించిన తండ్రి ప్రాణాలు కూడా గాల్లో కలిశాయి. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి దగ్గర జరిగిన ఈ హృదయవిదారక ఘటన.. కంటనీరు పెట్టించింది. ఛిద్రమైన భర్త, బిడ్డల మృతదేహాలను చూసి గుండె పగిలేలా రోదిస్తున్న మృతుడి భార్య రోదనలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. 

మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైలు ఢీకొని ముగ్గురు చనిపోయిన ఘటన అందరిని కలచి వేస్తోంది. ఈ ప్రమాదం ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసుల వివరాలు వెల్లడించారు. గౌడవెల్లి రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు క్రిష్ణ (38) అతని కూతుళ్లు వర్షిత(11),వరిని(5) అక్కడికక్కడే మరణించారు. మేడ్చల్‌లోని శ్రీ సాయి నిలయం రాఘవేందర్ నగర్ కాలనీలో కృష్ణ కుటుంబం నివాసం ఉంటుంది.

కృష్ణ రైల్వే లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీలో భాగంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు రైల్వే ట్రాక్ పైకి వెళ్లడంతో ఆ సమయంలో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ట్రాక్ పైకి దూసుకొచ్చి ఢీకొట్టింది. క్షణాల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.