- రూ. లక్షకు కొనుగోలు చేసిన పిల్లలు లేని దంపతులు!
- భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఆలస్యంగా తెలిసిన ఘటన
జూలూరుపాడు,వెలుగు: ఆడపిల్ల పుట్టిందని సాకలేక తల్లిదండ్రులు అమ్మిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. ఐసీడీఎస్అధికారులు, పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంకు చెందిన ఓ మహిళ గత అక్టోబర్ 4న రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆడ పిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే ఒక పాప, బాబు ఉన్నారు.
మళ్లీ ఆడ పిల్ల పుట్టిందని సాకలేమని లక్ష్మిదేవిపల్లి మండలానికి చెందిన పిల్లలు లేని దంపతులకు రూ. లక్షకు అమ్మినట్టు తెలిసింది. పిల్లలు లేని దంపతుల వద్ద పసిపాప ఉండడం చూసి స్థానికులు అడిగారు. బంధువుల పాపను తీసుకొచ్చుకున్నామని చెప్పగా అనుమా నించి ఐసీడీఎస్, పోలీసులకు సమాచారం అందించారు. అంగన్వాడీ సూపర్ వైజర్ లక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.