
- లారీ ఢీకొని బాలుడు మృతి
మెదక్ (చేగుంట), వెలుగు: రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజ్ పేట లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగేశ్ (11) అనే బాలుడు సైకిల్ మీద కిరాణా షాప్ కు వెళ్తుండగా కంటైనర్ లారీ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందాడు.
నూతన గృహ ప్రవేశం రోజే నగేశ్ ప్రమాదంలో మృతి చెందడంతో కొత్తింట్లో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రాస్తారోకో చేశారు. దీంతో గంట సేపు చేగుంట- గజ్వేల్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామాయంపేట సీఐ లక్ష్మీ బాబు వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు.