
పటాన్చెరు, వెలుగు: పెట్రోల్‌లో నీళ్లు కలిపి అమ్ముతున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో జరిగింది. శనివారం మండల పరిధిలోని కానుకుంటలో హర్ష పెట్రోల్‌బంక్‌లో పలువురు వాహనదారులు పెట్రోల్ కొట్టించుకోగా అనుమానం వచ్చి బాటిళ్లలో పట్టి చూశారు. పెట్రోల్ నీళ్లు కలిసినట్టు గుర్తించారు. దీంతో ఆగ్రహానికి గురైన వాహనదారులు బంక్ యాజమాన్యంతో గొడవకు దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు వాహనదారులు పెట్రోల్బాటిళ్లను చూపారు. వారు వెంటనే సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.