వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్ర గాయాలు

రాష్ట్రవ్యాప్తంగా  కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు కండలు పీకేస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో కుక్కల దాడికి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. 

కామారెడ్డిలోని అయ్యప్ప నగర్ కాలనీలో ఓ బాలుడిపై శునకాలు దాడి చేశాయి. 10 సంవత్సరాల రెహమాన్ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. రెహమాన్ ను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కల దాడులపై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లింద్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బారి నుంచి వారిని రక్షించాలని కోరారు.