నిద్రపోతున్న భర్తకు కరెంట్​ షాక్​ పెట్టిన భార్య

నిద్రపోతున్న భర్తకు కరెంట్​ షాక్​ పెట్టిన భార్య

నర్సింహులపేట, వెలుగు :  వివాహేతర సంబంధం పెట్టుకున్నావని భర్త తరచూ వేధిస్తుండడంతో అతడికి కరెంట్​ షాక్ ​పెట్టి చంపాలని చూసిందో భార్య. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం బోడ్కతండాకు చెందిన బాధవత్ బీకుకు.. లీలతో 14 ఏండ్ల కింద పెండ్లయ్యింది. అయితే, లీల వివాహేతర సంబంధం పెట్టుకుందని, పద్ధతి మార్చుకోవాలని కొంతకాలంగా హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడూ ఇదే విషయం ప్రస్తావిస్తూ తిట్టేవాడు. రోజూ ఇలాగే చేస్తుండడంతో గొడవలు పెరిగిపోయాయి.

దీంతో అతడిని చంపేందుకు నిర్ణయించుకుంది. గురువారం రాత్రి మద్యం తాగి వచ్చిన బీకు మళ్లీ గొడవ చేశాడు. పక్క ఇంట్లో ఉంటున్న బీకు తల్లిదండ్రులు వచ్చి సర్ది చెప్పి వెళ్లారు. కొద్దిసేపటికి ఆరుబయట పడుకున్న భర్త రెండు చేతులకు కరెంట్ ​వైర్లు చుట్టిన లీల ప్లగ్​బోర్డులో పెట్టి స్విచ్ఆన్ ​చేసింది. దీంతో గిలాగిలా కొట్టుకుంటున్న కొడుకును అతడి తల్లిదండ్రులు గమనించారు. వెంటనే పరిగెత్తుకు వచ్చి వైర్లు పీకేశారు. తెల్లారిన తర్వాత లీలపై పోలీస్ స్టేషన్లో  కంప్లయింట్ ​చేయడంతో విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లీలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.