కడెం ప్రాజెక్టులో డెడ్​బాడీ లభ్యం

కడెం, వెలుగు: కడెం జలాశయంలో ఓ యువకుడి డెడ్​బాడీ లభ్యమైంది. మధ్యప్రదేశ్​కు చెందిన దేవేంద్ర గౌతమ్(30) కడెం మండల కేంద్రంలోని ప్రాజెక్టు వద్ద డ్రిల్లింగ్​ పనులు చేస్తున్నాడు. జనవరి 31న రాత్రి ఎవరికీ చెప్పకుండా పని ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు. దేవేంద్ర బంధువులు రెండ్రోజులు పాటు వెతికి ఫిబ్రవరి 2న కడెం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జలాశయంలో ఓ డెడ్​బాడీ తేలుతుండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఖానాపూర్ సీఐ మోహన్, కడెం ఇన్​చార్జ్ ఎస్​ఐ ప్రభాకర్ రెడ్డి డెడ్​బాడీని బయటకు తీయించి, గౌతమ్​గా నిర్ధారించారు. దేవేంద్ర మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read : మళ్లీ పలు రైళ్ల రద్దు .. మరికొన్ని దారి మళ్లింపు