కడెం, వెలుగు: కడెం జలాశయంలో ఓ యువకుడి డెడ్‌బాడీ లభ్యమైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర గౌతమ్(30) కడెం మండల కేంద్రంలోని ప్రాజెక్టు వద్ద డ్రిల్లింగ్ పనులు చేస్తున్నాడు. జనవరి 31న రాత్రి ఎవరికీ చెప్పకుండా పని ప్రాంతం నుంచి వెళ్లిపోయాడు. దేవేంద్ర బంధువులు రెండ్రోజులు పాటు వెతికి ఫిబ్రవరి 2న కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జలాశయంలో ఓ డెడ్‌బాడీ తేలుతుండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఖానాపూర్ సీఐ మోహన్, కడెం ఇన్చార్జ్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి డెడ్‌బాడీని బయటకు తీయించి, గౌతమ్‌గా నిర్ధారించారు. దేవేంద్ర మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read : మళ్లీ పలు రైళ్ల రద్దు .. మరికొన్ని దారి మళ్లింపు