![వీళ్లు మామూలోళ్లు కాదు..ఊరినే తాకట్టు పెట్టారు](https://static.v6velugu.com/uploads/2025/02/incident-that-took-entire-village-by-storm-took-place-in-siddenapalem-pullalacheruvu-mandal-prakasam-district-andhra-pradesh_h1bIH0AQfo.jpg)
అమరావతి:ఏకంగా ఊరినే తాకట్టు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం సిద్దెనపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఏకంగా గ్రామ కంఠం భూమిని బ్యాంకులో తాకట్టుపెట్టి లోన్లు తీసుకున్నారు. గ్రామస్థుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
పుల్లెలచెరువు మండలం సిద్దెనపాలెం గ్రామానికి చెందిన గడ్డం సుబ్బయ్య, రామకోటయ్యలు గ్రామంలోని గ్రామ సర్వే నెం 296లో 8 ఎకరాల భూమిని రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లతో ఆన్ లైన్ చేసుకొని బ్యాంకుల్లో లోన్లు పొందారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ కు తరలించారు.
అయితే నిందితులకు సహకరించిన వీఆర్వో, RI, రికార్డు ఇంచార్జీ, డిప్యూటీ తహశీల్దారు, కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లక్షల్లో లంచాలు తీసుకొని నిందితులకు సహకరించిన వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.