
ఘట్కేసర్, వెలుగు: కడుపు నొప్పి భరించలేక మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం మున్సిపాలిటీ పరిధి అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్పలో ఉండే సోమని జయమ్మ(55) కొన్నేండ్లగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నయం కాలేదు. శుక్రవారం సాయంత్రం ఆమె కొడుకు రమేశ్ షాప్‌కు వెళ్లాడు.
అదే టైమ్‌లో జయమ్మకు కడుపు నొప్పి రావడంతో భరించలేక ఫినాయిల్ తాగింది. ఇంటికి వచ్చిన కొడుకు.. తల్లిని వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ జయమ్మ శనివారం చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.
భార్య కాపురానికి రావట్లేదని మరొకరు..
జీడిమెట్ల: భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలోని అమీద్బస్తీకి చెందిన తుకారాం (30)ఆటోడ్రైవర్. పదేండ్ల కిందట అతడికి పెళ్లైంది. వారి మధ్య గొడవలు రావడంతో తుకారాం భార్య లంగర్ హౌస్‌లోని తల్లిండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఎన్నిరోజులైనా ఆమె తిరిగిరాకపోవడంతో మనస్తాపం చెందిన తుకారాం శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.