రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు :  కలెక్టర్ రాజర్షి షా

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు :  కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం లేదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో రాజీవ్ యువ వికాసం పథకం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఇన్‌ కం సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పారు.

 దరఖాస్తు గడువును ఈ నెల14 వరకు పొడగించామన్నారు. మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులోఉన్నాయని, అర్హులైన వారు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామల దేవి, ఐటీడీఏ పీవో ఖుష్బుగుప్తా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.