- 2014 నుంచి ఇవి 74.2 శాతం డౌన్
- ఎస్బీఐ స్టడీ వెల్లడి
న్యూఢిల్లీ: మనదేశంలో ఆదాయ అసమానతలు అంతమవుతున్నాయని ఎస్బీఐ తాజా స్టడీ వెల్లడించింది. 2013–-14 , 2022–-23 ఆర్థిక సంవత్సరాల మధ్య సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు సంపాదిస్తున్న వారి మధ్య ఆదాయ అసమానతలు మొత్తంగా 74.2 శాతం తగ్గాయని వెల్లడించింది. ఎస్బీఐ ఆర్థిక విభాగం నుంచి వచ్చిన పరిశోధన నివేదిక 2013-–-14 , 2022–--23 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయ అసమానత అసమానతలను విశ్లేషించింది. 2015 అసెస్మెంట్ ఇయర్ నుంచి 2024 అసెస్మెంట్ఇయర్ వరకు తక్కువ ఆదాయ బ్రాకెట్లలో ఉన్న వ్యక్తులు ఆదాయాన్ని పెంచుకున్నారు.
రూ. 3.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులకు, ఆదాయ అసమానత 2014 ఆర్థిక సంవత్సరంలో 31.8 శాతం నుంచి 2021 ఆర్థిక సంవత్సరంలో 12.8 శాతానికి తగ్గింది. ఈ గ్రూపు వారి జనాభాతో పోల్చితే 19 శాతం ఆదాయం గణనీయంగా పెరిగింది. తక్కువ ఆదాయ సమూహం (రూ. 5.5 లక్షల కంటే తక్కువ) గత దశాబ్దంలో అన్ని సంవత్సరాలలో సానుకూల వృద్ధి రేటును నమోదు చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ కర్ణాటక వంటి రాష్ట్రాలు ఆదాయపు పన్ను చెల్లింపులో ముందంజలో ఉన్నాయి. ఆదాయపు పన్ను ఫైల్ బేస్‌లో వాటాను పెంచడంలో ఉత్తరప్రదేశ్ అగ్రగామిగా ఉంది.
తరువాత బీహార్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి. మొత్తం పన్ను రాబడికి ప్రత్యక్ష పన్నుల సహకారం 2024 అసెస్మెంట్ఇయర్లో 56.7 శాతానికి (అసెస్మెంట్ఇయర్23లో 54.6 శాతం) చేరుకుందని, ఇది 14 ఏళ్లలో అత్యధికమని ఎస్బీఐ అధ్యయనం పేర్కొంది. జీడీపీ నిష్పత్తికి ప్రత్యక్ష పన్నులు 2024 అసెస్మెంట్ఇయర్లో 6.64 శాతం వరకు పెరిగాయి. 2000–-01 నుంచి ఇదే అత్యధికం. 2024 అసెస్మెంట్ఇయర్ 8.6 కోట్ల ఐటీఆర్స్దాఖలు కాగా, 2022 అసెస్మెంట్ఇయర్ వీటి సంఖ్య 7.3 కోట్లు మాత్రమే ఉంది.