భద్రాద్రి రాముడి ..హుండీ ఆదాయం రూ.1.51కోట్లు

  •     ఎనిమిది రూ.2వేల నోట్లను వేసిన భక్తులు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 42 రోజులకు రూ.1,51,27,386ల ఆదాయం వచ్చింది. చివరిసారిగా 2023 నవంబరు 22వ తేదీన హుండీ ఆదాయం లెక్కించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తరద్వార దర్శనం వరుస సెలవులతో భక్తుల రద్దీ పెరిగింది. 

దీంతో హుండీ ఆదాయం కూడా భారీగానే పెరిగింది. బుధవారం హుండీల్లో 352 యూఎస్​ డాలర్లు , 71 మలేషియన్​ రింగ్స్, 1,10,000 ఇండోనేషియన్​రూపాయలు, ఖతార్​కు చెందిన 100 రియబ్స్, 125 యూఏఈ దిర్హమ్స్, 200 ఒమన్​బైసా, 10 నేపాల్​ రూపీలు, 10 యూరోలు, 20 థాయిలాండ్ ​బాత్స్, 92 గ్రాముల బంగారం, కిలో 500 గ్రాముల వెండి, పాత రూ.2 వేల నోట్లు 8 వచ్చాయి. ఈఓ రమాదేవి, ఈఈ రవీందర్​రాజ్​ తదితరులు పాల్గొన్నారు.