మేడారం హుండీ లెక్కింపు

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. సమ్మక్క హుండీ ద్వారా రూ. 23,45,970, సారలమ్మ హుండీలో రూ. 14,55,925, గోవిందరాజుల హుండీలో రూ. 94, 096, పగిడిద్దరాజు హుండీ ద్వారా రూ. 88,968 వచ్చినట్లు ఈవో రాజేంద్రన్‌‌ చెప్పారు. లెక్కింపులో సూపరింటెండెంట్‌‌ క్రాంతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి చంద గోపాలరావు పాల్గొన్నారు.