సింగరేణిలో జాతర హుండీల లెక్కింపు .. సమ్మక్క, సారలమ్మ జాతర ఆదాయం రూ. 13.61 లక్షలు

కోల్​బెల్ట్​, వెలుగు:  రామకృష్ణాపూర్​ పాలవాగు ఒడ్డున నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ జాతరలో హుండీ ఆదాయం రూ.13,61,700 సమకూరింది.  మంగళవారం ఉదయం మందమర్రిలోని సింగరేణి ఇల్లందు క్లబ్‌లో ఏరియా ఎస్​ఓటుజీఎం,  జాతర కన్వీనర్​ ఎ.రాజేశ్వర్​రెడ్డి, పర్సనల్​ మేనేజర్ శ్యాంసుందర్​, ఆర్కే--1ఏ  మైన్​ మేనేజర్​ జయంత్​ కుమార్​ సమక్షంలో లెక్కింపు చేపట్టారు. 

 జాతరలో 11  హుండీలను ఏర్పాటు చేశారు.    జాతర ప్రాంగంణంలో దుకాణా సముదాయాల టెండర్ల ద్వారా కూడా ఆదాయం వచ్చింది.   రెండేళ్ల క్రితం జరిగిన జాతరలో  రూ. 12.25 లక్షలు రాగా ఈ సారి ఆదాయం పెరిగింది.  లెక్కింపు కార్యక్రమంలో ఏరియా డీవైపీఎం మైత్రేయబంధు, కేకే -5  వెల్ఫేర్​ ఆఫీసర్ కార్తీక్​ తదితరులు పాల్గొన్నారు.