శ్రీ రాజరాజేశ్వర నాగాలయం జాతర ఆదాయం రూ.2.72 లక్షలు

రాయికల్​, వెలుగు:రాయికల్​ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో హుండీని అధికారులు మంగళవారం లెక్కించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా హుండీ ఆదాయం రూ.2.72లక్షలు వచ్చినట్లు ఈవో విక్రమ్​ తెలిపారు.

జగిత్యాల డివిజన్​ ఆలయ ఇన్​స్పెక్టర్​ రవికిషన్​ ఆధ్వర్యంలో హుండీలను లెక్కించారు. అర్చకులు చెరుకు రాజేశ్వరశర్మ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్​ దానవేని రాము, సభ్యులు నాగరెడ్డి, జల, ముత్యం, నర్సయ్య పాల్గొన్నారు.