Income Tax: బ్యాంకునుంచి తక్కువ విత్ డ్రాలు, అనుమానాస్పద ఖర్చులపై ఇంకమ్ ట్యాక్స్ నిఘా

Income Tax: బ్యాంకునుంచి తక్కువ విత్ డ్రాలు, అనుమానాస్పద ఖర్చులపై ఇంకమ్ ట్యాక్స్ నిఘా

బ్యాంకు ఖాతాలనుంచి తక్కువ విత్ డ్రా చేస్తున్నారా..వంట నూనె, ఉప్పులు, పప్పులు, సౌందర్య సాధనాలు, విద్య, రెస్టారెంట్ విజిట్స్, హెయిర్ స్టైల్స్ వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారా..అయితే జాగ్రత్త..ఇటువంటి వారిపై ఇంకమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ నిఘా ఉంచింది. ఐటీ నోటీసులు జారీ చేస్తోంది. 

బ్యాంకు ఖాతాలనుంచి తక్కువ విత్ డ్రాలు చూపిస్తున్న కొంతమంది వ్యక్తులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. డేటా విశ్లేషణ ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

వంట నూనె, గోధుమ, బియ్యం, గ్యాస్, షూ, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, విద్య, రెస్టారెంట్ విజిట్స్, హెయిర్ స్టైల్స్ వంటి వాటిపై ఎంత ఖర్చు చేశారనే దానితో సహా తక్కువ విత్ డ్రాల వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ కోరింది. 

అధిక ఆదాయం ఉన్నట్టు చూపిస్తున్న మంది మాత్రమే చాలా తక్కువ ఖర్చు చేస్తున్నారని.. మిగతా వారి ఖర్చులపై ఐటీ శాఖ అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వార్షిక ఆదాయం , పాన్ నంబర్లతో సహా వారి వివరాలను కూడా ఇవ్వాలని కోరింది . వివరాలను సమర్పించని వారి అంచనా ప్రకారం ఆ సంవత్సరానికి వారి ఇంటి నుంచి రూ.1 కోటి విలువైన విత్ డ్రాలు జరిగి ఉంటాయని భావిస్తోంది. 

ఈ నోటీసులు సాధారణమైనవి కావు..విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నప్పటికీ వారి బ్యాంకు ఖాతాల నుంచి చాలా తక్కువ విత్‌డ్రా చేస్తున్నారు.. అటువంటి వారిపై అనుమానంతో నోటీసులు పంపించినట్లు ఐటీశాఖ అధికారులు అంటున్నారు.ఇటువంటి ఖర్చుల్లో అప్రకటిత అదనపు ఆదాయ వనరు లేదా నగదు ఉండ వచ్చని అధికారులు అనుమానంతో నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.