కొత్త గైడ్లైన్స్ జారీ
న్యూఢిల్లీ: ఇన్ కంటాక్స్ డిపార్ట్మెంట్ 2020–21 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిన విధానాన్ని ప్రకటించింది. రూ.50 లక్షలలోపు ఆదాయం కలిగిన వ్యక్తులు సాధారణ రిటర్న్ ఫామ్ను ఉపయోగించాలి. జీతం, పెన్షన్ నుంచి, స్థిరాస్తుల నుంచి ఆదాయం, వడ్డీ పొందేవాళ్ల కోసం ఆ ఫామ్ను రూపొందించారు. భార్య, మైనర్ల నుంచి ఆదాయం వస్తే అసెసీ ఆదాయానికే కలుపుతారు. కంపెనీ డైరెక్టర్లు, గత ఏడాదిలో అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్లు ఉన్నవాళ్లు, ఏదైనా కంపెనీ నుంచి వడ్డీపొందేవాళ్లు, విదేశాల్లో సైనింగ్ అథారిటీ ఉన్న వాళ్లు, అక్కడి నుంచి ఆదాయం పొందేవాళ్లు రిటర్న్ ఫామ్ను వాడకూడదు. లాటరీల నుంచి, గుర్రపు పందేల నుంచి, స్పెషల్ రేట్ల నుంచి ఆదాయం వచ్చినా, వ్యవసాయం నుంచి రూ.ఐదు వేల కంటే ఎక్కువ మొత్తం వచ్చినా కూడా ఈ ఫామ్ను ఉపయోగించకూడదు. అంతేగాకా హౌజ్ ప్రాపర్టీ నుంచి నష్టాలు వస్తున్నా, ‘ఇతర వనరుల’ నుంచి నష్టం వస్తున్నా, సెక్షన్ 90, 91,57 ప్రకారం ఏవైనా మినహాయింపులు పొందినా, మూలం వద్ద పన్ను కోతకు ఏవైనా క్రెడిట్లు పొందిన ఈ ఫామ్ వర్తించదు. రిటర్న్ ఫామ్ దాఖలు చేసే వాళ్లకు దానికి ఎలాంటి అనెగ్జర్లూ ఇవ్వాల్సిన (టీడీఎస్ సర్టిఫికెట్ కూడా) అవసరం లేదు. ఒకవేళ జతచేసి ఇస్తే, తిరిగి వాటిని అసెసీకే వాపసు ఇస్తారు.
ఒకటి లేదా ఎక్కువ బ్యాంకు అకౌంట్లలో రూ.కోటి కంటే ఎక్కువ జమ చేస్తే ఆ విషయాన్ని తప్పక తెలియజేయాలి. ఫారిన్ టూర్ ఖర్చు రూ.రెండు లక్షలు దాటినా, కరెంటు బిల్లు రూ.లక్ష దాటినా వెల్లడించాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం, లాభం పొందని ఇండివిడ్యువల్స్, హిందు అన్డివైడెడ్ ఫ్యామిలీలు ఐటీఆర్–2 ఫారమ్ను ఉపయోగించాలి.
క్యాపిటల్ గెయిన్స్ అన్నింటినీ కలిపి చూపకూడదు. ఏ1, బీ1 క్యాపిటల్ గెయిన్స్ను విడివిడిగా లెక్కించాలి. ఈక్విటీ షేర్ల అమ్మకంతో వచ్చిన లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ను వేరుగా చూపించాలి.
ఫైలింగ్ గడువు పొడగింపు
ఆర్థిక సంవత్సరం 2018–19 కోసం ఐటీఆర్, జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్కు చివరి తేదిని మరో రెండు నెలలు పాటు ప్రభుత్వం పొడిగించింది. దీంతో యాన్యువల్ రిటర్నులు ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 వరకు ట్యాక్స్ పేయర్లకు వీలుంటుంది. గతంలో 2018–19 జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్కు, ఆడిట్ రిపోర్టును అందజేయడానికి అక్టోబర్ వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.
For More News..