
న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్‌లో విదేశీ ఆస్తులు, పెట్టుబడుల గురించి ప్రస్తావించని ట్యాక్స్ పేయర్లకు ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపింది. సుమారు రూ.22 వేల కోట్ల విలువైన ఇలాంటి ఆస్తులను తాజా డ్రైవ్‌లో గుర్తించింది. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాల కింద ఫారిన్ అసెట్స్‌పై వివరాలను ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పొందింది. ఇందులో విదేశాల్లో ఉన్న ల్యాండ్, షేర్లపై వచ్చే డివిడెండ్ వంటివి ఉన్నాయి.
ట్యాక్స్ రిటర్న్స్‌లో వీటి వివరాలను ప్రస్తావించకపోయిన ట్యాక్స్ పేయర్లకు మొదట ఈ–మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ పంపారు. వీటికి రెస్పాన్స్ కాని వారికి మాత్రమే నోటీసులు పంపామని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్ 2015 కింద ఫారిన్ అసెట్స్ వివరాలను ట్యాక్స్ పేయర్లు కచ్చితంగా బయట పెట్టాలి. ఫెయిలైతే రూ.10 లక్షల వరకు పెనాల్టీ పడుతుంది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఫామ్ 15సీసీ పరిశీలించి, తాజాగా నోటీసులు పంపింది.