![ఐటీ వెబ్సైట్ రీలాంచ్.. కొత్త ఫీచర్లు, యూజర్ ఫ్రెండ్లీనెస్](https://static.v6velugu.com/uploads/2023/08/Income-Tax-Department_2uHCnASFYx.jpg)
న్యూఢిల్లీ: ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తమ వెబ్‌సైట్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు, వాల్యూయాడెడ్ ఫీచర్లు, కొత్త మాడ్యూల్స్ తో రీలాంచ్ చేసింది . ఈ కొత్త వెబ్‌సైట్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా ఉదయ్‌పూర్‌లో జరిగిన చింతన్ శిబిర్‌లో ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలనే ఆలోచనతోనే వెబ్సైట్రీలాంచ్ చేసినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. మొబైల్ నుంచి చూసేందుకు కూడా కొత్త వెబ్సైట్ అనువుగా ఉంటుందని పేర్కొంది.
కంటెంట్ కోసం మెగా మెను ఉంటుందని, కొత్త ఫీచర్లు, ఫంక్షనాలిటీస్ చేర్చామని వివరించింది. వెబ్సైట్ విజిటర్లకు ఈ కొత్త మార్పులన్నీ వివరించేందుకు ఒక వర్చువల్ గైడెడ్ టూర్ అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కంటెంట్‌ను వెతుక్కునేందుకు వీలుగా ఉంచినట్లు వెల్లడించింది.