83 మంది చీఫ్ కమిషనర్లు.. 155 మంది ప్రిన్సిపల్ కమిషనర్ల ట్రాన్స్ఫర్

83 మంది చీఫ్ కమిషనర్లు.. 155 మంది ప్రిన్సిపల్ కమిషనర్ల ట్రాన్స్ఫర్

ఐటీ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. దేశవ్యాప్తంగా 83  మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 155  మంది ప్రిన్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులను కూడా ట్రాన్స్ ఫర్ చేసింది. హైదరాబాద్ జోన్  ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) ఇన్వెస్టిగేషన్  డీజీ గా సంజయ్ బహదూర్, హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్, విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద  రాధాకృష్ణ నియమితులయ్యారు. 

ఆగస్టు నెల చివరి వారం నుంచి తెలంగాణలోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై జరుగుతున్న ఆదాయపు పన్ను దాడులు రాజకీయ వర్గాల్లో, ప్రముఖుల్లో గుబులు రేపుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న ప్రముఖ కంపెనీల్లో జరుగుతున్న సోదాల వ్యవహారం ప్రముఖులను చుట్టుకునేలా ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో ఐటీ శాఖలో జరిగిన భారీ బదిలీల వ్యవహారం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.