ఆర్థిక లావాదేవీలు, ట్యాక్స్ ప్రాసెస్కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన పాన్కార్డు చాలా ముఖ్యమైనది.అయితే నకిలీ పాన్ కార్డులు,మల్టీపుల్ పాన్ కార్డు ను కలిగి ఉండటం చట్ట విరుద్ధం.. తీవ్ర పరిణామాలకు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనిపై ఆదాయపు పన్ను శాఖ పెనాల్టీ విధిస్తుంది.
ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 272B ప్రకారం ప్రభుత్వాన్ని మసం చేసే ఉద్దేశంతో లేదా పన్నులు ఎగవేసే ఉద్దేశంతో మల్టీపుల్ పాన్ కార్డులను కలిగి ఉంటే రూ. 10వేల జరిమానా విధిస్తోంది ఆదాయపు పన్ను శాఖ. పాన్ కార్డు హోల్డర్లందరూ తమ పాన్ -ఆధార్ ను లింక్ చేయాలని ఐటీ శాఖ గతంలో సర్క్యూలర్ జారీ తోపాటు గడువు ను కూడా ఇచ్చింది. పన్ను ఎగవేతలను నియంత్రించేందుకు ఐటీ శాఖ పాన్ -ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది.
ఆధార్ -పాన్ లింక్ చేయకుంటే..
- పన్ను చెల్లింపుదారులు ITR ఫైల్ చేయలేదు.
- పెండింగ్ లో ఉన్న రిటర్న్ లు ప్రాసెస్ చేయబడవు
- పనిచేయని PAN కార్డులకు పెండింగ్ లో ఉన్న రీఫండ్ లు జారీ చేయబడవు.
- TCS/TDS అధిక రేటుతో వర్తిస్తుంది
- TCS/TDS క్రెడిట్ ఫారమ్ 26AS లో కనిపించదు, TCS/TDS ప్రమాణ పత్రాలు అందుబాటులో ఉండవు.
- పన్ను చెల్లింపు దారులు నిల్ TDS కోసం 15G/15H డిక్లరేషన్ లు సమర్పించలేదు
- పాన్ కార్డ పని చేయని కారణంగా లావాదేవీలు చేయలేం
- బ్యాంకు ఖాతాను తెరవలేం
- డెబిట్ /క్రెడిట కార్డుల జారీ ఉండదు
- మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయలేం.
- రోజులో రూ. 50వేల కంటే ఎక్కువ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో నగదు డిపాజిట్ చేయలేం