Income Tax: పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్.. ఐటీ శాఖ కీలక నిర్ణయం..!

Income Tax: పన్ను చెల్లింపుదారులకు కీలక అప్‌డేట్.. ఐటీ శాఖ కీలక నిర్ణయం..!

Tax News: వాస్తవానికి మరో నాలుగు రోజుల్లో మార్చి నెల ముగియనుంది. అంటే పాత ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాయి. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటన ప్రకారం మార్చి 29 నుంచి మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాలు తెరబడి ఉండనున్నాయి. దీని ద్వారా దేశంలోని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సెలవు దినాల్లో కూడా తమ టాక్స్ సంబంధింత సమస్యలను పరిష్కరించుకోవటానికి వెసులుబాటు కలగనుంది. 

Also Read :- ఆ కంపెనీలో 49 శాతం వాటాలు కొంటున్న ఎల్ఐసీ

సెంట్రల్ బోర్డ్ ఏం చెప్పింది?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ తాజా సర్కులర్ పరిశీలిస్తే.. పెండింగ్‌లో ఉన్న విభాగపు పనులను పూర్తి చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆదాయపు పన్ను కార్యాలయాలను మార్చి 29 నుంచి 31 వరకు తెరచి ఉంచాలని నిర్ణయించింది. తద్వారా ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ చెల్లింపులు, సెటిల్‌మెంట్‌లను ఈ కాలంలో పూర్తి చేయాలని నిర్ణయించబడింది. 2023-24 సంవత్సరానికి నవీకరించబడిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా మార్చి 31 కావటంతో ఇప్పటికీ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయని వ్యక్తులు ఈ చివరి నాలుగు రోజులను సధ్వినియోగం చేసుకోవాలని పన్ను శాఖ సూచిస్తోంది.

Also Read :- ప్రమాదంలో బెంగళూరు టెక్కీలు.. ఇప్పుడు ఇల్లు కొనొచ్చా లేక ఆగాలా..?

అలాగే పన్ను చెల్లింపుదారుల కోసం మార్చి 31న కూడా బ్యాంకులు తెరచి ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకింగ్ సంస్థలకు వెల్లడించింది. అయితే ఈ ప్రత్యేక పనిదినాన బ్యాంకులు సాధారణ కస్టమర్లకు సేవలను అందించవు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల సెటిల్మెంట్లను ఆర్థిక సంవత్సరం చివరి రోజున పూర్తి చేస్తాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు గత ఏడాది కంటే దాదాపు 13 శాతం పెరిగి ఏకంగా రూ.21.26 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.