హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ సోదాల కొనసాగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర మూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దిల్ రాజ్, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగ్ మీడియా అధినేత రాము ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఇటీవల రిలీజైన భారీ సినిమాల ప్రొడ్యూసర్స్, వాటికి ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీలపై కూడా ఐటీ సోదాలు చేస్తోంది. బంజారాహిల్స్లోని దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి బడ్జెట్ చిత్రాల ద్వారా వచ్చిన ఆదాయంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో సినిమాకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్స్ కంపెనీలపై కూడా ఐటీ సోదాలు చేస్తోంది. డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐటీ అధికారులు..
జనవరి 22న పుష్పా 2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి సుకుమార్ ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు ఐటీ అధికారులు. పుష్ఫ 2 సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ,ఆదాయ వివరాలను ఆరాదీస్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.