సంగారెడ్డి టౌన్, వెలుగు: అసంపూర్తిగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను, టాయిలెట్స్ ని త్వరగా పూర్తిచేయాలని అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా స్థాయి న్యూట్రిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి బాలామృతం అందిస్తూ తల్లిదండ్రులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్ పెంచేలా కృషి చేయాలని సూపర్వైజర్లు, టీచర్లకు సూచించారు. కిశోర బాలికల్లో రక్తహీనతను గుర్తించి అందుకు తగిన సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీపీవో సాయిబాబా, డీ డబ్ల్యూవో లలిత కుమారి, డీఐవో శశాంక్, మెప్మా పీడీ గీత, డీపీఎం జయశ్రీ, జగదీశ్వర్, పాషా పాల్గొన్నారు.