భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలో చేపట్టిన డ్రైనేజీ పనులు పూర్తికాక పోవడంతో మురుగునీరంతా రోడ్లపైకి చేరి.. దుర్వాసన పెరుగుతోంది. నిరుడు అప్పటి కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఫండ్స్ రిలీజ్ చేయడంతో పట్టణంలో నాలుగు లేన్ల రోడ్డు. డివైడర్లు నిర్మించారు. రోడ్డుకు రెండు పక్కలా డ్రైనేజీనిర్మించాల్సి ఉండగా ఒకే వైపు పనులు ప్రారంభించారు.
అదికూడా అసంపూర్తిగా నిలిచిపోగా.. మరో వైపు పనులు ప్రారంభం కాలేదు. దీంతో మురుగు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి కంపు కొడుతోంది. వెంటనే పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.