కరీంనగర్ సిటీలోని పద్మనగర్‌లో స్మార్ట్‌సిటీ నిధులు రూ.60లక్షలతో పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు ప్రారంభించి ఏడాదైనా నేటికీ పూర్తికాలేదు. దీంతో పార్క్‌లో ఆట వస్తువులు, సేద తీరేందుకు తీసుకొచ్చిన కుర్చీలు మూలనపడ్డాయి. అలంకరణ వస్తువులు కళావిహీనంగా మారాయి. పార్క్‌లో పిచ్చిమొక్కలు మొలిచాయి. మందుబాబులు కొందరు పార్క్‌లో తాగుతూ సీసాలు పడేస్తున్నారు.