- ఈ సెక్టార్‌కు 4,417.3 కోట్లు
- కాటన్ ప్రొక్యూర్‌మెంట్‌కు రూ.600 కోట్లు
- టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్‌కు రూ. 635 కోట్లు
న్యూఢిల్లీ: టెక్స్టైల్ రంగానికి కేంద్ర సర్కారు ఈ సారి ప్రాధాన్యతనిచ్చింది. ఈ రంగానికి 28% బడ్జెట్‌ను పెంచింది. 2024–25 బడ్జెట్లో టెక్స్టైల్ రంగానికి రూ.4,417.03 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.4,373 కోట్లు రెవెన్యూ, రూ.43.65 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ప్రతిపాదించింది. కాటన్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి సేకరణకు ఇందులో రూ.600 కోట్లు కేటాయించింది.
పత్తి ధరలు.. కనీస మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండడంతో గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కాటన్ ప్రొక్యూర్‌మెంట్‌కు నిధులు కేటాయించలేదు. ప్రస్తుతం ధరలు ఎంస్పీ కంటే తక్కువగా ఉండడంతో కేంద్రం నిధులు ఇచ్చింది. అలాగే, సవరించిన టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ స్కీమ్ (ఏడీయూఎఫ్ఎస్)కు రూ. 635 కోట్లు కేటాయించింది. నిరుడు ఈ స్కీమ్‌కు రూ. 675 కోట్లు ఇచ్చింది. ఇక నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్(ఎన్‌టీటీఎం) కోసం రూ. 375 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 170 కోట్లు ప్రతిపాదించిన కేంద్ర సర్కారు.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని డబుల్ చేసింది.
పీఎల్ఐ స్కీమ్‌కు రూ.45 కోట్లు
రీసెర్చ్అండ్ కెపాసిటీ బిల్డింగ్కింద టెక్స్టైల్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్ఐ) కు రూ. 45 కోట్లను కేంద్ర సర్కారు కేటాయించింది. అలాగే, స్కిల్డెవలప్మెంట్ఇంటిగ్రేటెడ్ స్కీమ్ కోసం రూ. 166 కోట్లు, టెక్స్టైల్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం కోసం రూ. 100 కోట్లు ప్రతిపాదించింది. రీసెర్చ్అండ్ కెపాసిటీ బిల్డింగ్కోసం బడ్జెట్‌ను రూ. 380.50 కోట్ల నుంచి రూ. 686 కోట్లకు పెంచింది.
కాగా, ఈ బడ్జెట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాగే, కొత్త టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటుకు ఉద్దేశించిన పీఎం మిత్ర కోసం రూ. 300 కోట్లు కేటాయించారు. రా మెటీరియల్ సప్లై స్కీమ్‌కోసం రూ. 172 కోట్లు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)కు 98.67 కోట్ల కేటాయింపులు చేశారు. నిరుడితో పోలిస్తే నిఫ్ట్‌కు ఈసారి బడ్జెట్ తగ్గించారు.