హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న యూనివర్శిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్‌ను 65 సంవత్సరాలకు పొడగించింది. ఈ మేరకు 2025, జనవరి 30న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ఏడాది రిటైర్మెంట్ కానున్న ప్రొఫెసర్లు మరో 5 సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
ఇటీవల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యూనివర్శిటీ ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. సీఎం మాటిచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్‌ను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్వర్తులు వెలువడటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.