అన్‌‌డూ సెండ్‌‌ టైం ఫ్రేమ్​ పెంచుకోండిలా! 

అన్‌‌డూ సెండ్‌‌ టైం ఫ్రేమ్​ పెంచుకోండిలా! 

 మెయిల్స్‌‌తో ఎక్కువగా పని చేయాల్సిన టైం ఇది. అయితే కొన్నిసార్లు పొరపాటున ఇ–మెయిల్‌‌ వేరే అడ్రస్‌‌కు సెండ్‌‌ చేయొచ్చు. లేదా మెయిల్‌‌లో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు. సెండ్‌‌ చేసిన మెయిల్‌‌ను సరిచేసుకోవడానికి ‘అన్‌‌డూ’ మంచి ఆప్షన్‌‌. మెయిల్‌‌ సెండ్‌‌ చేసిన వెంటనే కింద అన్‌‌డూ ఆప్షన్‌‌ కనిపిస్తుంది. దీన్ని వెంటనే నొక్కితే, పంపిన మెయిల్‌‌ వెనక్కి తిరిగొస్తుంది. కాకపోతే, సాధారణంగా ఇది ఐదు సెకండ్లలోపే చేయాలి. ఆలోపు ‘అన్‌‌డూ’ చేయకపోతే మెయిల్‌‌ సెండ్‌‌ అవుతుంది. ఈ పొరపాటు జరగకూడదనుకుంటే ‘అన్‌‌డూ’ టైమ్‌‌ ఫ్రేమ్‌‌ను పెంచుకోవచ్చు. ఐదు సెకన్ల నుంచి ముప్పై సెకన్ల వరకు పెంచుకోవచ్చు. జీమెయిల్‌‌తోపాటు, ఔట్‌‌లుక్‌‌లోనూ ఈ ఆప్షన్‌‌ ఉంది. ‘అన్‌‌డూ’ ఫీచర్‌‌‌‌ను ‘డిలే సెండ్‌‌’ ఆప్షన్‌‌ అని కూడా అంటారు. అంటే మెయిల్ పంపిన తర్వాత అది చేరేందుకు సెట్‌‌ చేసుకున్న టైం పడుతుంది. ఈ ఫీచర్‌‌‌‌ను వాడుకునేందుకు మెయిల్‌‌లో జనరల్‌‌ సెట్టింగ్స్‌‌లోకి వెళ్లి, అడ్వాన్స్‌‌డ్‌‌ సెక్షన్‌‌లో కింద డ్రాప్‌‌–డౌన్‌‌ మెనూలో కనిపించే ‘అన్‌‌డూ సెండ్‌‌’ ఆప్షన్‌‌పై క్లిక్‌‌ చేయాలి. తర్వాత అక్కడ ‘సెండ్‌‌ క్యాన్సిలేషన్‌‌ పీరియడ్‌‌’ అనే టైం ఫ్రేం కనిపిస్తుంది. దానిలో ముప్పై సెకన్లు సెలక్ట్‌‌ చేసుకుంటే చాలు. ఇ–మెయిల్‌‌ సెండ్‌‌ చేసిన అర నిమిషంలోపు ‘అన్‌‌డూ’ సెలక్ట్‌‌ చేసుకుంటే మెయిల్‌‌ సెండ్‌‌ కాదు. చాలాసార్లు ఈ ఫీచర్‌‌‌‌ వల్ల తప్పులు జరగకుండా చూసుకోవచ్చు.