
హైదరాబాద్, వెలుగు: కిందటేడాది జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 1,80,914 మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. ఇందులో 1,08,520 మెట్రిక్ టన్నులు అంతర్జాతీయ గమ్యస్థానాలకు జరగగా, 72,395 మెట్రిక్ టన్నులు ఇండియాలోని వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యాయి. కంపెనీ 20కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు కార్గోను పంపింది. ముఖ్యంగా ఫార్మా ప్రొడక్ట్‌లు ఎక్కువగా ఎగుమతి చేసింది. కిందటేడాది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎగుమతైన మొత్తం కార్గోలో వీటి వాటా 72 శాతంగా ఉంది. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి సగానికి పైగా ఎగుమతులు యూఎస్, యూరప్ దేశాలకు జరుగుతున్నాయి.