బిజినెస్ డెస్క్ వెలుగు: ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెద్దగా వడ్డీ రావడం లేదు. ఈక్విటీ మార్కెట్లలో కూడా రిటర్న్ చాలా తక్కువగా ఉంది. ఇంకా రిస్క్ ఎక్కువ కూడా. ఇలాంటి పరిస్థితులలో ఈ–గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. అంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్స్, డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతున్నాయి. ఈ–గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి, ఎంత రిటర్న్ వస్తుంది వంటి విషయాలు కింద ఉన్నాయి..
ఈ-గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే?
ఈ–గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ప్రభుత్వం ఇష్యూ చేస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్ల(ఎస్‌జీబీ)ను, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ను, మ్యూచువల్‌ఫండ్స్ ఆఫర్ చేస్తున్న గోల్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. వీటికి తోడు ఫైనాన్షియల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న డిజిటల్ గోల్డ్‌ను కూడా కొనుగోలు చేయొచ్చు. సాధారణంగా ఈ–గోల్డ్‌ను స్టాక్ బ్రోకర్లు, పేమెంట్ వాలెట్ల ద్వారా గోల్డ్ మైనింగ్ కంపెనీలు, గోల్డ్ ట్రేడర్లు ఆఫర్ చేస్తారు. అందువలన ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేసే వారు ఫిజికల్ గోల్డ్‌ను పొందడానికి వీలుంటుంది. కానీ ఎస్‌జీబీలను కొన్న వారికి ఎటువంటి ఫిజికల్ గోల్డ్ అందదు. ఇవి మెచ్యురిటీ(ఎనిమిదేళ్లు) అయ్యేటప్పుడు అప్పటి గోల్డ్ ధరను ఇన్వెస్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అంతేకాకుండా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై ప్రతీ ఏటా వడ్డీని కూడా ఇస్తుంది.
ఇన్వెస్టర్ల ఖర్చులు..
ఎస్‌జీబీలను కొనే కస్టమర్లకు ఎటువంటి అదనపు ఖర్చులు పడవు. వీటిని అమ్మే బ్యాంకులు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రభుత్వమే కమీషన్ చెల్లిస్తుంది. అదే ఈటీఎఫ్‌ల విషయానికి వస్తే అదనపు ఛార్జీలను కట్టాల్సి ఉంటుంది. వీటికి తోడు డీమాట్ అకౌంట్‌ను ఓపెన్ చేయడానికి, మెయింటెయిన్ చేయడానికి ఛార్జీ పడుతుంది. గోల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే ఫండ్‌ను మెయింటెయిన్ చేస్తున్నందుకు ఛార్జీని వసూలు చేస్తారు. దీనికి తోడు నిర్దిష్టమైన పీరియడ్ కంటే ముందే ఫండ్ నుంచి బయటకు వచ్చేస్తే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అదే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు 3 శాతం వరకు జీఎస్‌టీని కట్టాలి. వీటికి తోడు స్టోరేజ్ ఖర్చులు, ఇన్సూరెన్స్, ట్రస్టీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ–గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్లకు సేఫ్టీ ఉంటుందా?
సావరిన్ గోల్డ్ బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేయడంలో రిస్క్ ఉండదు. రీపేమెంట్ కచ్చితంగా జరుగుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్‌ను సెక్యూరిటీ ఎక్స్చేంజ్‌లు రెగ్యులేట్ చేస్తాయి. అందువలన ఇన్వెస్టర్లకు రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్‌లపై ఎటువంటి రెగ్యులేషన్ లేదు. కాబట్టి వీటిలో రిస్క్ ఎక్కువ. ఎస్‌జీబీలపై వచ్చే వడ్డీని ఇన్వెస్టర్ల ఆదాయానికి యాడ్ చేస్తారు. అందువలన ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌ల ప్రకారం పన్ను విధిస్తారు. ఎస్‌జీబీలు మెచ్యూరిటీ అయ్యేంత వరకు అమ్మకుండా ఉంటే వీటిపై వచ్చే లాభంపై ట్యాక్స్ విధించరు. ఇన్వెస్టర్లు మూడు–ఎనిమిదేళ్ల మధ్యలో ఎగ్జిట్ అయితే ఫిజికల్ గోల్డ్‌పై ట్యాక్స్ ఎంతుంటుందో అంత వేస్తారు.
ఇన్వెస్టర్లకు ఏది మంచిది?
మెచ్యురిటీ టైమ్ వరకు అమ్మవద్దనుకునే ఇన్వెస్టర్లు ఎస్‌జీబీలను ఎంచుకోవడం మంచిది. ఈ బాండ్లు ఎక్స్చేంజ్‌లలో లిస్ట్ అయినప్పటికీ, లిక్విడిటీ తక్కువగా ఉండడం వల్ల వీటిని అమ్మలేకపోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్‌లలో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మెచ్యూరిటీకి ముందే ఎగ్జిట్ అవుతామనుకునే ఇన్వెస్టర్లకు ఇవి బెటర్. డిజిటల్ గోల్డ్‌ను కొన్న కస్టమర్లు ఫిజికల్ గోల్డ్‌ను లేదా డబ్బులను డెలివరీ పెట్టుకోవచ్చు. డిజిటల్ గోల్డ్‌లో కనీసం రూ. 1 నుంచే ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ వీటిని చూసే రెగ్యులేటరీ లేదు. తక్కువ అమౌంట్ అయితే డిజిటల్ గోల్డ్‌లలో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ అమౌంట్‌ల కోసం ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్ బెటర్.
For More News..