
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో హైదరాబాద్‌లో 9,459 ఇండ్లు అమ్ముడయ్యాయని, కిందటేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఒక శాతం తగ్గాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. కొత్త లాంచ్‌లు కూడా 4 శాతం పడిపోయి 10,661 యూనిట్లుగా నమోదయ్యాయి.
మరోవైపు ఆఫీస్ స్పేస్‌కు మాత్రం డిమాండ్ కనిపించింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో హైదరాబాద్‌లో 40 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం లావాదేవీలు జరిగాయి. ఏడాది లెక్కన 31 శాతం గ్రోత్ నమోదైంది. సగటు రెంటు కూడా చదరపు అడుగుకి నెలకు రూ.72 కి పెరిగింది. ఏడాది లెక్కన 9 శాతం వృద్ధి నమోదయింది.