హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ గేట్లు బుధవారం తెరుచుకున్నాయి. సాగర్‌కు ఎగువ నుంచి 1,08,782 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 64,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకుంది.
సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6,253 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 6,022, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,907, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.