
హైదరాబాద్ లో గురువారం ( ఏప్రిల్ 3)న కురిసిన భారీ వర్షానికి మూసీ ప్రవాహం పెరిగింది. చైతన్యపురి దగ్గర మూసీ నదిలో ఇద్దరు చిక్కుకున్నారు. వీరు శివాలయం దగ్గర కూలీలని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుజాత, చైతన్య పురి కార్పొరేటర్ రంగ నర్సింహ గుప్త వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు కోసం హైడ్రా కు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తివివరాలు అందాల్సి ఉంది.