ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి

యాదాద్రి, వెలుగు : ఈ నెల 30 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్టకు వస్తున్నందున, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎంవీ.భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏవో నాగేశ్వరాచారి, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌ ఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏసీపీలు వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నర్సింహారెడ్డి, డీఆర్డీవో ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, డీటీవో సురేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీఏవో అనురాధ ఉన్నారు. 

కల్యాణలక్ష్మి  చెక్కుల పంపిణీ

చండూరు (గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌), వెలుగు : దేశవ్యాప్తంగా ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌కు చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ చెక్కులను శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కల్యాణి రవికుమార్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ పులి సైదులు పాల్గొన్నారు.


స్కూళ్లను వదిలి బార్లను పెంచుతున్రు

సూర్యాపేట, వెలుగు : స్కూళ్లను పట్టించుకోని ప్రభుత్వం బార్లు, వైన్స్‌‌‌‌‌‌‌‌ను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లలో మండల కార్యవర్గ, మోర్చా, పోలింగ్‌‌‌‌‌‌‌‌ బూత్‌‌‌‌‌‌‌‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, మునుగోడు నియోజకవర్గలలో 57 ఏళ్ల వారికి వృద్ధాప్య పింఛన్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నప్పుడు సూర్యాపేటలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. హాస్టళ్లలో సరైన వసతులు లేవని, స్టూడెంట్లకు అందించే ఆహారం క్వాలిటీగా ఉండడం లేదన్నారు. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చి రైతుల మధ్య పంచాయితీ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పేర్వాల లక్ష్మణరావు, అసెంబ్లీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ కర్నాటి కిషన్, కిసాన్‌‌‌‌‌‌‌‌ మోర్చా అధ్యక్షుడు ధరావత్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, మండల ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకన్న, బిట్టు నాగరాజు పాల్గొన్నారు.

నల్గొండ ఎమ్మెల్యే ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు హ్యాక్‌‌‌‌‌‌‌‌

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌, ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు హ్యాక్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా విభాగం శనివారం సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.


బీఆర్‌ఎస్‌తో కలిసి కేంద్రంపై పోరాటం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం

సూర్యాపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌తో కలిసి పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. శనివారం సూర్యాపేటలో జరిగిన జిల్లా విస్తృతస్థాయి మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీలను తనలో కలుపుకుంటోందన్నారు. తమ మాట వినని ప్రభుత్వాలపై ఈడీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఆ పార్టీతో కలిసి పనిచేస్తామని, అయితే ప్రజాసమస్యలపై మాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోడు భూములు, ఇండ్ల స్థలాలు, దళితబంధు సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని చెప్పారు. ఈ నెల 29న జరిగే భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, రవినాయక్‌‌‌‌‌‌‌‌, మట్టిపెల్లి సైదులు పాల్గొన్నారు.

రుణమాఫీ ఎప్పుడు చేస్తరు ?

నార్కట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ స్పష్టంగా చెప్పాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాలలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతోందన్నారు. డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లకు ప్రతి బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో నిధులు కేటాయించినా వాటిని ఖర్చు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాలో సాగు,తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్‌‌‌‌‌‌‌‌కే.షరీఫ్‌‌‌‌‌‌‌‌, లింగయ్య, మేకల భిక్షం, సత్తయ్య, బాలరాజు పాల్గొన్నారు.

పెరిగిన రైతుబంధు లబ్ధిదారులు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య గతంతో పోలిస్తే ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో పెరిగింది. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 2,54,977 మంది లబ్ధిదారులు ఉండగా ప్రస్తుతం 6,075 మంది రైతులు పెరగడంతో లబ్ధిదారుల సంఖ్య 2,61,052కు చేరుకుంది. వీరికి ఈ సీజన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రైతుబంధు కింద రూ.303.80 కోట్లు అందాల్సి ఉంది. అయితే ప్రతీ సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా వివిధ కారణాలతో పెట్టుబడి సాయం మాత్రం అందరికీ అందడం లేదు.  ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌లో 20 వేల నుంచి 30 వేల మంది రైతులకు రైతుబంధు అందడం లేదు. 2018 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ సంవత్సరం వానాకాలం వరకు యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 18,74,036 మందికి రైతుబంధు అందాల్సి ఉండగా, 17,23,132 మందికే అందింది. మరో 1,50,904 మంది రైతులకు రూ. 238.14 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది. అయితే రైతులకు రైతుబంధు అందకపోవడానికి సాంకేతిక అంశాలే కారణమని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు. ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డుల్లో ఉన్న పేర్లకు బ్యాంకు అకౌంట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పేరుకు తేడా ఉండడం, కొత్తగా పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ వచ్చిన రైతుల్లో కొందరు అకౌంట్ల వివరాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడి సాయం అందడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. అలాగే అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కూడా రైతులకు సాయం అందడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.