విద్యుత్‌‌‌‌ ఆర్టిజన్​లకు పెరిగిన జీతాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విద్యుత్‌‌‌‌ ఆర్టిజన్​ల జీతాలు పెంచుతూ ట్రాన్స్‌‌‌‌కో, జెన్‌‌‌‌కో సీఎండీ ప్రభాకర్‌‌‌‌ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా మూడు గ్రేడ్‌‌‌‌లు ఉన్న ఆర్టిజన్​లకు 7శాతం ఫిట్‌‌‌‌మెంట్‌‌‌‌ పెంచారు. అదేవిధంగా, బేసిక్‌‌‌‌ పే ఏప్రిల్‌‌‌‌1, 2022 నెల నుంచి పెంచడంతో పాటు డీఏ 24.90శాతం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రాన్స్‌‌‌‌కోలో పనిచేసే ఆర్టిజన్స్​కు కన్వీనియన్స్‌‌‌‌ అలవెన్స్‌‌‌‌ కింద వెయ్యి రూపాయలు ఇవ్వనున్నారు. గ్రేడ్‌‌‌‌ త్రీ, గ్రేడ్‌‌‌‌ ఫోర్‌‌‌‌ ఆర్టిజన్‌‌‌‌లకు నెలకు రూ.500 స్పెషల్‌‌‌‌ అలవెన్స్‌‌‌‌ ప్రకటించారు. ఇలా తాజాగా పే రివిజన్‌‌‌‌తో గ్రేడ్‌‌‌‌ వన్‌‌‌‌ ఆర్టిజన్లకు రూ.37,020, గ్రేడ్‌‌‌‌ 2 ఆర్టిజన్లకు రూ.29,015, గ్రేడ్‌‌‌‌ 3 ఆర్టిజన్లకు రూ.22,175 చొప్పున జీతాలు రానున్నాయి. అదేవిధంగా, పెన్షనర్లకు పెన్షన్‌‌‌‌ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.