కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇటీవల అకాల వర్షాలతో కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం జిల్లాలో అత్యధికంగా బిచ్కుందలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారిలో 41.8, రామారెడ్డిలో 41.7, డొంగ్లిలో 41.6, ముగ్ధంపూర్, మాచాపూర్‌లో 41.5 డిగ్రీల చొప్పున, బొమ్మదేవునిపల్లిలో 41.4
బీబీపేట, సర్వాపూర్, ఆర్గొండల్లో 41.3 డిగ్రీల చొప్పున, పిట్లంలో 41.2, పెద్దకొడప్గల్లో 40.9, లింగంపేట, హాసన్‌పల్లి, వెల్పుగొండల్లో 40.8 డిగ్రీల చొప్పున, మెనూర్లో 4.7, నాగిరెడ్డిలో 40.6, లచ్చాపేటలో 40.5, కొల్లూర్‌లో 40.3, దోమకొండలో 40.2, పుల్కల్లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.