సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి 2 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 19,141 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 14,141 క్యూసెక్కులుగా ఉంది. 29.40 టీఎంసీలు ప్రసుత్తం ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండగా, పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు. జల విద్యుత్కేంద్రంలో విద్యుత్ఉత్పత్తి కొనసాగుతుంది. పెరిగిన వాటర్ఫ్లో వల్ల ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ALSO READ | వ్యక్తిగత అజెండా లేదు.. లేక్స్ను కాపాడటమే లక్ష్యం: డిప్యూటీ CM భట్టి